అనకాపల్లి క్యాప్స్ రాక్స్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు 500 చికెన్ బిర్యానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిత్యం రోడ్డు మీదే కాపలాకాస్తున్న వారికి 300 మిల్టన్ వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. మా ఈ కార్యక్రమానీ జోనల్ కమినర్ రామ్మూర్తి ప్రారంభించారు. అనంతరం టౌన్ సిఐ భాస్కరరావు మరియు ట్రాఫిక్ సిఐ మజ్జి శ్రీనివాసరావుకి మిల్టన్ వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొర్లి శేఖర్, కోరుకొండ రాఘవ,నల్లల శ్రీనివాస రాజా,జాజుల రమేష్ ,వాకాడ సతీష్, లక్ష్మణ రావు, ప్రసాద్,ఉగ్గిన అప్పారావు పల్లెల గణేష్, మంగ ఈశ్వర్, పెంటారావు, రావి రమేష్, హరీష్, జయసూర్య తిమ్మాపాత్రుని,పెద్దాడ రమాశంకర్,పొలనటి ప్రకాష్ ,కలగ నోకేశ్వరారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని కాపు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బాగా చేశారు అని పలక రవి,బొద్దపు ప్రసాద్, తాడి రామకృష్ణ, మంగా అప్పారావు అభినందనలు తెలిపారు.