విశాఖపట్నం వాస్తవ నయనమ్
జర్నలిస్టులకు బీమా సదుపాయం కల్పించాలి హర్యానా తరహాలో రాష్ట్రంలోని జర్నలిస్టుల బీమా సదుపాయం కల్పించాలని జాతీయ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నగర అధ్యక్షులు పి. నారాయణ్ లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వారు ఇక్కడ దుర్గాలమ్మ గుడి సమీపము లో మాట్లాడుతూ హర్యానాలో ప్రతీ జర్నలిస్ట్ కు 10 లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించారని రాష్ట్రంలో ఆ సదుపాయం కల్పించాలని కోరారు. కరోనా విలయ తాండవం చేస్తోందని ఆయా వివరాలు సేకరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న జర్నలిస్టుల సేవలను ప్రభుత్వం గుర్తించి కనీసం 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందివ్వాలని కోరారు. అన్ని రంగాల్లోనూ వెనుకబడ్డ జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని జర్నలిస్ట్ల సమస్యల పై రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ శుక్రవారం మరో వినతి పత్రం సమర్పించినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో ఎపిడబ్ల్యుజెఎఫ్ నాయకులు డి రవికుమార్ ఈరోతి ఈశ్వర్రావు. జి శ్రీనివాసరావు శివ ప్రసాద్ వై. రామకృష్ణ, ఎన్. రామకృష్ణ, బి. సీతారామమూర్తి, సునీల్, పీ. శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు