: తమిళనాడు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వేలూరు కలెక్టర్ ఆదేశాల మేరకు తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో రోడ్డుకు అడ్డంగా ఏడు అడుగుల సిమెంట్ గోడ నిర్మాణం చేశారు. దీంతో స్థానికులు విషయాన్ని చిత్తూరు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. చిత్తూరులోని మూడు సరిహద్దు ప్రాంతాలైన పత్తలపల్లి, పరదరామి, క్రిస్టియన్‌పేట చెక్‌పోస్టుల వద్ద తమిళనాడు అధికారులు గోడ నిర్మాణం చేసినట్లు స్థానికులు తెలిపారు.
చెక్‌పోస్టుల వద్ద వాహనాల సరుకును మాత్రమే మార్చుకోవాలని వాహనాలు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి వీలు లేదని వేలూరు కలెక్టర్ షణ్ముగ సుంద్రమ్ తెలిపారు. చిత్తూరు జిల్లా నుంచి వెలూరుకు వచ్చే వారు తప్పని సరిగా చెక్‌పోస్టుల వద్ద ఉన్న వైద్య శిబిరంగా ఆరోగ్య పరిక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ 19 కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.