వివేకానంద సంస్థలో నిరాశ్రయులకు సేవలు దుప్పట్లు,పండ్లు పంపిణీ

  • ప్రతీ రోజు ఉచితంగా అల్పాహారం భోజన సదుపాయం

  • సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్ 


విశాఖపట్నం/పాత పోస్ట్ ఆఫీస్ వాస్తవ నయనమ్: 


పాత నగరం లోని వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ అనాధాశ్రమం ద్వారా ప్రతిరోజూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్ అన్నారు.బుధవారం పాతనగరంలోని పలువురు నిరుపేదలకు నిరాశ్రయులకు అల్పాహారం భోజన సదుపాయం తో పాటు వారికి దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జహీర్ అహ్మద్ మాట్లాడుతూ గతంలోకూడా పలు సేవా కార్యక్రమంలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు.అయిత కరోనాను దృష్టిలో ఉంచుకొని సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశామన్నారు.జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ నిరంతరం వివేకానంద సంస్థకు అవసరమైన చేయూత అందిస్తామన్నారు.ఈ ఆశ్రమానికి అవసరమైన మంచాలు దుప్పట్లు మరిన్ని అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నిరుపేదకు వీల్ చైర్ అందించారు.సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు 39 వ వార్డు వైసీపీ అభ్యర్థి కొల్లి  సింహాచలం,విజేఫ్ కార్యవర్గ సభ్యుడు ఇరోతి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.