ఏపీలో తాజాగా 9 కరోనా కేసులు నమోదు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఏపీలో నిన్న సాయంత్రం 7 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన 9 కేసుల్లో కృష్ణా, కర్నూల్‌, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడు కేసుల చొప్పున నమోదు అయ్యాయి. కొత్తగా నమోదైన 9 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 534కు చేరింది. ఈ 534 కేసుల్లో 20 మంది కోలుకోగా, 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఐసోలేషన్‌ వార్డుల్లో 500 మంది చికిత్స పొందుతున్నారు. 


అనంతపూర్‌ జిల్లాలో 21, చిత్తూరులో 23, తూర్పు గోదావరిలో 17, గుంటూరులో 122, కడపలో 36, కృష్ణాలో 48, కర్నూల్‌లో 113, నెల్లూరులో 58, ప్రకాశంలో 42, విశాఖపట్టణంలో 20, పశ్చిమ గోదావరి జిల్లాలో 34 కేసులు నమోదు అయ్యాయి.