ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 82 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,259కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో 5,783 మందికి పరీక్షలు నిర్వహించగా 82 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 258 డిశ్చార్జి కాగా, 31 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 970 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


గడిచిన 24 గంటల్లో జరిపిన పరీక్షల్లో..అనంతపురం జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 17, వైఎస్సార్‌ జిల్లాలో 7, కృష్ణా జిల్లాలో 13, కర్నూలు జిల్లాలో 40, నెల్లూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. 


జిల్లాల వారీగా కరోనా కేసులు..