ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి దంపతులపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున ముంబైలోని స్టూడియో నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గోస్వామి దంపతులకు గాయాలు కాలేదు. అర్నాబ్ గోస్వామి, సమియా గోస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోస్వామి నిన్న ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలో విశ్వసనీయత లోపించిందని ఆరోపిస్తూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని పాల్‌ఘార్‌లో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్‌పై గుంపు దాడి ఘటనపై టీవీ లైవ్ చర్చలో అర్నబ్ తన రాజీనామాను ప్రకటించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేసినట్లు ముంబై జోన్ 3 డీసీపీ ప్రకటించారు.
అర్నాబ్ గోస్వామి దంపతులపై దాడి...