లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థకు ఆర్బీఐ రిపేర్లు మొదలుపెట్టింది. తాజాగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు రూ.50000 కోట్ల ద్రవ్య ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ప్రఖ్యాత ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ సంస్థ దేశంలోని ఆరు ఫండ్స్ ను గతవారం లాక్‌చేయటంతో ఏర్పడిన భయాలను తొలగించేందుకు ఈ ప్యాకేజీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ నిధులను మ్యూచుల్ ఫండ్ సంస్థలకు నేరుగా ఇవ్వరు. మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రుణాలు ఇస్తుంటాయి. అందుకోసం బ్యాంకుల వద్ద ద్రవ్యం లభ్యత ఉండేలా ఈ నిధులను బ్యాంకులు వాడుకోవచ్చు. 90 రోజుల కాలానికి ఫిక్స్‌డ్ రెపో రేటుతో అందజేస్తామని ఆర్బీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
మ్యూచువల్ ఫండ్స్‌కు 50000 కోట్లు