తుని వాస్తవ నయనమ్
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను తుని పట్టణంలో పోలీసులు మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. పట్టణ సీఐ రమేష్ బాబు లాక్ డాన్ అమలు తీరుపై డ్రోన్ కెమెరా ని వినియోగించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పట్టణ ప్రజలు కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అవకాశం కల్పించి, ఆ సమయంలో కూడా ప్రజలు సామాజిక దూరం పాటించే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఎవరు బయటకు రాకూడని పోలీసులు హెచ్చరిస్తున్నారు.అదే కాకుండా ప్రజలు బయటకు వస్తే పోలీసులు వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, పోలీసుల కళ్లు కప్పి బయట తిరగాలి అనుకున్నవారికి ఇక చెక్ పెట్టినట్లే అని తెలియజేసారు. డ్రోన్ కెమెరా ని వినియోగించి పట్టణంలో అన్ని ప్రధాన రహదారుల్లో
పరిస్థితి ని ఎప్పటి కప్పుడు సీఐ పర్యవేక్షిస్తున్నారు.