హిమాలయాల్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు ఈనెల 29వ తేదీనే తెరుచుకోనున్నాయి. ముందుగా అనుకున్న తిథి ప్రకారమే ఆలయాన్నితెరవనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తొలుత ఆలయాన్ని మే 14వ తేదీన తెరవనున్నట్లు వార్తలు వచ్చాయి. ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి చేసిన ఆ ప్రకటనపై పండితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇవాళ ప్రధాన పూజారి భీమాశంకర లింగ ఆధ్వర్యంలో ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో కేదార్‌నాథ్ ఆలయాన్ని తెరిచే ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ముందుగా అనుకున్నట్లు వసంత పంచమి రోజున ఆలయాన్ని తెరవనున్నట్లు ఆలయ కమిటీ ఇంచార్జ్ హరిష్ గౌడ తెలిపారు. ఈనెల 29వ తేదీన ఉదయం 6.10 నిమిషాలకు కేదార్‌నాథ్ ఆలయాన్ని భక్తుల కోసం తెరువనున్నారు. పండితులతో కలిపి మొత్తం 16 మంది డోలీల్లో ఆలయానికి వెళ్లనున్నారు.
ఈనెల 29నే తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయం