24 గంటల్లో 50 మరణాలు.. 1383 కొత్త కేసులు

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్‌ నియంత్రణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 50 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా 1883 కేసులు నమోదైనట్లు తెలిపింది. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,984కు చేరింది. ఇందులో 3,870 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో 640 మంది ప్రాణాలు కోల్పోయారు.