భారత్‌లో 24 గంటల్లో 37 కరోనా మరణాలు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 37 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా 1684 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 718 మంది ఈ వైరస్‌తో చనిపోయినట్లు పేర్కొంది. 4749 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 


మహారాష్ట్రలో 6,427 పాజిటివ్‌ కేసులు(మృతులు 283), గుజరాత్‌లో 2,624(మృతులు 112), ఢిల్లీలో 2,376(మృతులు 50), రాజస్థాన్‌లో 1,964(మృతులు 28), మధ్యప్రదేశ్‌లో 1,687(మృతులు 83), తమిళనాడులో 1,683(మృతులు 20), ఉత్తరప్రదేశ్‌లో 1,510(మృతులు 24), తెలంగాణలో 970(మృతులు 25), ఆంధ్రప్రదేశ్‌లో 893(మృతులు 27), పశ్చిమ బెంగాల్‌లో 456(మృతులు 15), కేరళలో 447(మృతులు ఇద్దరు), కర్ణాటకలో 445(మృతులు 17), జమ్మూకశ్మీర్‌లో 434(మృతులు 5), పంజాబ్‌లో 283(మృతులు 17), హర్యానాలో 270(మృతులు ముగ్గురు), బీహార్‌లో 170(మృతులు ఇద్దరు), ఒడిశాలో 89(ఒకరు మృతి), జార్ఖండ్‌లో 53(మృతులు ముగ్గురు), ఉత్తరాఖండ్‌లో 47, హిమాచల్‌ప్రదేశ్‌లో 40(మృతులు ఇద్దరు), అసోంలో 36(ఒకరు మృతి), ఛత్తీస్‌గఢ్‌లో 27, అండమాన్‌నికోబార్‌ దీవుల్లో 22, లడఖ్‌లో 18, మేఘాలయలో 12, గోవా, పుదుచ్చేరిలో 7 చొప్పున, మణిపూర్‌, త్రిపురలో 2 కేసుల చొప్పున, అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరాంలో ఒక కేసు చొప్పున నమోదు అయ్యాయి.