బ్రిటన్‌కు చెందిన మాజీ యుద్ధ సైనికుడు, కెప్టెన్ టామ్ మూర్.. ఎన్‌హెచ్ఎస్ కోసం భారీ విరాళాలు సేకరించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో కెప్టెన్‌గా చేసిన టామ్ మూర్ ప్రస్తుత వయసు 99 ఏళ్లు. మరికొన్ని రోజుల్లో ఆయన నూరవ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. అయితే కోవిడ్‌పై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో.. కెప్టెన్ టామ్ మూర్ తన ఇంట్లోనే వంద రౌండ్ల వాకింగ్ టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఛాలెంజ్‌తో ఆయన ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరించారు. ఏప్రిల్ 3వ తేదీన ఆయన తన ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. తన గార్డెన్‌లో వంద ల్యాప్‌లు తిరగనున్నట్లు అతను మొదట్లో చెప్పాడు. అప్పుడు సుమారు వెయ్యి పౌండ్ల విరాళం వస్తుందని ఆశించారు. కానీ నేటితో కెప్టెన్ టామ్ మూర్ వంద ల్యాప్‌లు పూర్తి చేశాడు. ఒక్కొక్క రౌండ్ సుమారు 25 మీటర్ల పొడుగు ఉంటుంది. అయితే అతను వీల్‌చైర్ సహాయంతో ఈ వాకింగ్ చేశాడు. చివరకు టామ్ తన లైవ్ వాకింగ్ ద్వారా 12 మిలియన్ల పౌండ్ల విరాళాలు సేకరించారు. ఆ మొత్తం సుమారు 115 కోట్లు ఉంటుంది.
115 కోట్ల విరాళం సేకరించిన వందేళ్ల యుద్ధ వీరుడు