అమరావతి: ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పంచాయతీలకు భారీ నజరానాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నజరానాను జనాభా ప్రాతిపదికన నాలుగు విభాగాలుగా విభజించారు. రెండు వేల జనాభా ఉన్న గ్రామాలకు రూ.5 లక్షలు, 2 నుంచి 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.10 లక్షలు, 5 నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.15 లక్షలు, 10,000 జనాభా దాటిన గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమైతే రూ.20 లక్షల నజరానా ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మహిళలు.. మహారాణులు
రాష్ట్రంలో 13,368 గ్రామ పంచాయతీలు ఉండగా, సగానికిపైగా మహిళలకే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు చేసింది. 6,831 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లుగా మహిళలే రాబోతున్నారు. ఈ మేరకు రిజర్వేషన్ల వివరాలను పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ వారీగా రిజర్వేషన్ల వివరాలు..
మొత్తం గ్రామ పంచాయతీలు: 13,368
ఎస్టీ మహిళ: 762
ఎస్టీ జనరల్: 480
బీసీ మహిళ: 1,615
బీసీ జనరల్: 1,543
జనరల్ మహిళ: 3,096
జనరల్: 3,375