రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేకప్ వేసుకున్న విషయం తెలిసిందే. పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్ అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన లుక్ రీసెంట్‌గా విడుదలైంది. ఇందులో పవన్ చాలా కూల్‌గా పుస్తకం చదువుతున్నట్టు కనిపించారు. అయితే ఈ ఫస్ట్ లుక్ విడుదలైన 24గంటలలో పలు రికార్డ్‌లు క్రియేట్ చేసింది. టైటిల్ ట్యాగ్‌తో 3.5 మిలియన్ ట్వీట్లు చేయగా, ఫస్ట్ లుక్‌ని 25.3 వేల మంది రీ ట్వీట్ చేశారు. టాలీవుడ్ చరిత్రలో ఇలాంటి రికార్డ్ ఇంత వరకు ఎవరు క్రియేట్ చేయలేదని చెబుతున్నారు. కేవలం ఫస్ట్ లుక్ ఇంతటి ప్రభంజనం సృష్టిస్తుంటే ఇక టీజర్, ట్రైలర్, సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి. బోనీ కపూర్ సమర్పణలో బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు
రికార్డులపై కన్నేసిన 'వకీల్ సాబ్'