లోక్‌సభలో ప్రతిష్టంభన

  • అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం 

  • ఢిల్లీ అల్లర్లపై చర్చకు విపక్షాల డిమాండ్‌ 

  • హోలీ తర్వాత చర్చిద్దామన్న సర్కారు 

  • తక్షణమే చర్చించాలన్న ప్రతిపక్షాలు

  • సభను నేటికి వాయిదా వే

    లోక్‌సభలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఢిల్లీ అల్లర్లపై తక్షణమే చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్‌తో సభలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలతో సభ మార్మోగిపోయింది. మంగళవారం కూడా బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు తోపులాటకు యత్నించారు. ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ జరపాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేయగా.. హోలీ పండగ తర్వాత, ఈ నెల 11న చర్చ జరుపుదామని స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు. అయినా శాంతించని ఎంపీలు తక్షణమే చర్చించాలని డిమాండ్‌ చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార, విపక్ష సభ్యులు ఎవరైనా సరే ఇతర వరసల్లోకి వెళ్తే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. అయితే కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి వెల్‌లోకి దూసుకురావడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినంత పనైంది. ఈ సమయంలో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సభ మళ్లీ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌, డీఎంకే, ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఢిల్లీ అల్లర్లపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. జీరో అవర్‌లో చర్చిద్దామని స్పీకర్‌ చెప్పినా శాంతించలేదు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న ఎంపీలపై స్పీకర్‌ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోకి ప్లకార్డులను అనుమతించబోమని స్పష్టం చేశారు. సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ‘ఇదే పంథాలో పనిచేస్తారా.. ఆలోచించుకోండి’ అని సూచించారు. గందరగోళం కొనసాగడంతో సభను మధ్యాహ్నానికి వాయి దా వేశారు. మళ్లీ సమావేశమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బుధవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ విపక్ష సభ్యుల ఆందోళనతో మంగళవారం కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు.  


    సీఏఏ ఆందోళనల్లో పాల్గొన్న ఐదుగురు విదేశీయులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ మంగళవారం లోక్‌సభలో తెలిపారు.


    సిన స్పీకర్‌