యూత్‌ని ఆకట్టుకుంటున్న విజయ్‌ దేవరకొండ హోలీ పాట

హోలీ పండుగ అంటేనే ఆనందాల కేళి.. సప్త వర్ణాలు చల్లుకుంటూ తెగ ఎంజాయ్‌ చేస్తారు. యూత్‌ అయితే రంగుల్లో మునిగి తేలుతారు. ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకుంటూ.. మిఠాయిలు పంచుకుంటూ హోలీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే హీరో విజయ్‌ దేవరకొండపై చిత్రీకరించిన హోలీ పాట ఇప్పుడు యూత్‌ను ఆకట్టుకుంది. 2017లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హోలీ పాటను చిత్రీకరించింది. ఈ పాటను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, విజయ్‌ దేవరకొండ నటించారు. మత సామరస్యాలకు అతీతంగా హోలీని జరుపుకోవడాన్ని ఈ పాటలో చూపించారు. విజయ్‌ దేవరకొండ ఈ పాటలో ఉండడంతో యూత్‌ని బాగా ఆకట్టుకుంది.


https://youtu.be/0VcSQruuWH4