హాయ్‌.. నేను విజయ్‌ దేవరకొండ అంటూ యువతులతో..

  • ఫేస్‌బుక్‌లో నకిలీ పేజీ ఏర్పాటు 

  • ప్రధానంగా యువతులతో చాటింగ్‌ 

  • కేసు నమోదు చేసిన సైబర్‌ కాప్స్‌  


: ప్రముఖ సినీ నటుడు విజయ్‌ దేవరకొండ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ నకిలీ పేజీ ఏర్పాటైంది. దీని ద్వారా యువతులకు వల వేస్తున్న మోసగాడు విజయ్‌ మాదిరిగా చాటింగ్స్‌ చేస్తున్నాడు. ఈ విషయం గుర్తించిన విజయ్‌ దేవరకొండ తన సహాయకుడినే మహిళగా రంగంలోకి దింపి చాటింగ్‌ చేయించారు. విషయం రూఢీ కావడంతో మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు తన మేనేజర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టారు. ఫేస్‌బుక్‌లో విజయ్‌ దేవరకొండ పేరుతో కొన్నాళ్ల క్రితం ఓ నకిలీ పేజ్‌ ఏర్పాటైంది. దీన్ని చూసిన అనేక మంది ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. ఇలాంటి రిక్వెస్ట్‌ల్లో యువతులకు సంబంధించినవి గుర్తిస్తున్న మోసగాడు వారితో మెసెంజర్‌ ద్వారా చాటింగ్‌కు దిగుతున్నాడు.