శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఖాజ్‌పురా రెబన్ ఏరియాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఘటనాస్థలి నుంచి ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధాలతో పాటు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం