హిమాచల్‌ గవర్నర్‌ దత్తాత్రేయకు స్వల్ప అస్వస్థత

హైదరాబాద్‌ : హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం దత్తాత్రేయకు ఛాతిలో నొప్పి రావడంతో హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో దత్తాత్రేయకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. కొద్ది రోజుల పాటు దత్తాత్రేయకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.