కరోనా దెబ్బకు ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు విలవిలలాడాయి. సెన్సెక్స్ సుమారు 2000 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 8100 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న నేపథ్యంలో.. స్టాక్ మార్కెట్లు బోరుమన్నాయి. అమెరికా మార్కెట్లు కూడా డీలాపడడంతో.. ఇవాళ ఉదయం సెక్సెక్స్, నిఫ్టీలు ట్రేడింగ్‌లో పతనం చూపించాయి. సెన్సెక్స్ భారీగా పతనం కావడంతో.. సుమారు 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపేశారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా తగ్గింది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ ఇండియా, ఐటీసీ, హీరో మోటో కార్ప్ లాంటి సంస్థలు భారీగా నష్టపోయాయి. ఇవాళ ఉదయం దాదాపు 10 శాతం మేరకు మార్కెట్లు డౌన్ అయ్యాయి.
మార్కెట్లు పతనం.. ట్రేడింగ్ నిలిపివేత