న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. దేశ వ్యాప్తంగా మొత్తం 73 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ 73 మందిలో 56 మంది దేశీయులు కాగా, 17 మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపింది. దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ఇప్పటి వరకు 10,57, 506 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని పేర్కొంది. ఢిల్లీలో 6, హర్యానాలో 14(అందరూ విదేశీయులే), కేరళలో 17, రాజస్థాన్‌లో 3(ఇద్దరు విదేశీయులు), తెలంగాణలో ఒకరు, ఉత్తరప్రదేశ్‌లో 10(ఒకరు విదేశీయులు), లఢఖ్‌లో 3, తమిళనాడులో ఒకరు, జమ్మూకశ్మీర్‌లో ఒకరు, పంజాబ్‌లో ఒకరు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73