అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం దాదాపు రూ. 145 కోట్లకి పైగా షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.121 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. రీసెంట్‌గా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఈ క్రమంలో చిత్రం నుండి ఒక్కో వీడియో సాంగ్ విడుదల చేస్తూ వస్తున్నారు. కొద్ది సేపటి క్రితం సూర్యుడివో చంద్రుడివో సాంగ్‌ను రిలీజ్ చేసారు. విజయశాంతి కుటుంబ సభ్యులతో కలిసి మహేష్ బాబు ఉన్న ఈ పాట ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగానే కనెక్ట్ అయింది. ఈ పాట ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడుకొని ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్ని అందించారు. ప్రరాక్ ఈ పాటను అద్భుతంగా పాడాడు. ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు నిర్మించారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషించిన విషయం విదితమే.
https://youtu.be/qeK5xl15ZBo