నవీ ముంబై: గాయం నుంచి కోలుకున్న టీమ్‌ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య డీవై పాటిల్ టీ20కప్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఎప్పుడెప్పుడు జాతీయజట్టులోకి రావాలా అని చూస్తున్న పాండ్య అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు. టోర్నీలో రిలయన్స్-1 జట్టు తరఫున ఆడుతున్న హార్దిక్ మంగళవారం కాగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 105 పరుగులు చేసి సత్తాచాటాడు. ఏకంగా పది సిక్సర్లు బాదడంతో పాటు ఎనిమిది ఫోర్లు కొట్టాడు. ఏ ఒక్క బౌలర్‌ను విడిచిపెట్టకుండా బంతిని వీరబాదుడు బాదాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రిలయన్స్-1 జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 252పరుగులు చేసింది. అనంతరం హార్దిక్ పాండ్య బౌలింగ్‌లోనూ రాణించి ఐదు వికెట్లు తీయడంతో కాగ్ 151పరుగులకే ఆలౌటైంది. రిలయన్స్-1 101 పరుగుల తేడాతో లీగ్ దశలో తన ఆఖరి మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రత్యక్షంగా వీక్షించాడు. ఐదు నెలల క్రితం వెన్నుకు శస్త్రచికిత్స చే యించుకున్న పాండ్య అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
37 బంతుల్లో సెంచరీ కొట్టిన హార్ధిక్ పాండ్యా