మెగాస్టార్ 152 సినిమా ఫ‌స్ట్‌లుక్ ఎప్పుడంటే..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవిపై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు కొర‌టాల‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్‌లో మ‌హేశ్ పాల్గొన‌బోతున్నారు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని టాక్‌. రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవ‌దాయ భూముల ప‌రిర‌క్ష‌ణ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుంది. సినిమాను ఆగ‌స్ట్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు.