ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నాడు. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ మొదలు పెట్టని రాజమౌళి మరి కొద్ది రోజులలో ఫస్ట్ లుక్‌తో పాటు చిత్ర టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. స్వాతంత్య్ర సమరం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రఘుపతి రాఘవ రాజారాం అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం భావిస్తుందట. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే కాబట్టి, ఆ రోజు చిత్ర టైటిల్‌తో పాటు చరణ్ లుక్‌కి సంబంధించిన పోస్టర్ విడుదలవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అజయ్ దేవ్‌గన్, అలియా భట్‌లు చిత్రంలో కీలక పాత్రల్లో నటించనుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.