జురాసిక్ తొలి పార్ట్ 1993లో విడుదల కాగా, వెండితెరపై రాక్షస బల్లులు చేసిన వీర విహారానికి పిల్లలూ పెద్దలూ ఫిదా అయిపోయారు. దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల మతులు పోగొట్టింది. మూడో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్‌ని చిత్ర దర్శకుడు కోలిన్ ట్రెవరో కొందరు రచయితలో కలిసి అద్భుతంగా రాసుకున్నాడట. తొలి భాగంలో నటించిన స్యామ్ నీల్, లారా డెర్న్, జెఫ్ గోల్డ్‌బ్లమ్ కూడా ఈ చిత్రంలో నటిస్తారు. త్వరలోనే చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
'జురాసిక్ వరల్డ్ డొమినియన్' షూటింగ్ మొదలైంది