చింతపల్లి వాస్తవనయనమ్: ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో అడ్డగోలుగా చేపల దుకాణాలు. నిజానికి చెప్పాలంటే పంచాయతీ అనుమతి తీసుకుని దుకాణాలు నిర్వహించాలి కానీ అటువంటి పరిస్థితులు చింతపల్లి మండల కేంద్రంలో లేదు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న మురుగు కాలువల్లో ఇప్పటికే కంపు కొడుతుంటే దానికి తోడు రహదారికి ఇరువైపులా చేపల దుకాణాలు ఏర్పాటు చేసి చేపలను కట్ చేసిన వాటి వ్యర్థాలను, చెత్తను మురుగు కాలువలో పడేస్తుండటంతో మరింత దుర్వాసన కొడుతుంది. ఈ విషయమై పంచాయతీ అధికారులకు ప్రశ్నించిన సమస్య పరిష్కారం కాలేదు. నిత్యం వారపు సంతలో చేపల దుకాణాలు చేపల మార్కెట్ లో పెట్టుకొనే నిర్వాహకులు నేడు అటవీశాఖ, తహశీల్దార్, రోడ్లు భవనాల శాఖ, ఏపీఎస్ ఆర్టీసీ కాంప్లెక్స్ కార్యాలయాల ఎదురుగా చేపల దుకాణాలు నిర్వహిస్తున్నారు. దీనివలన ప్రయాణికులకు అదేవిధంగా పారిశుధ్య కార్మికులకు ఇబ్బందికరంగా ఏర్పడుతుందని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న చేపల దుకాణాలను వెంటనే తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రధాన రహదారికి ఇరువైపులా విచ్చలవిడిగా చేపల దుకాణాలు- చోద్యం చూస్తున్న అధికారులు.