గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బాణాలు దించిన ముద్దుగుమ్మ సమంత. ఫిబ్రవరి 26,2010న విడుదలైన ఈ చిత్రం సమంతకి డెబ్యూ మూవీ అయినప్పటికీ ఎంతో పరిణితితో నటించింది. ఇందులో సమంత ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా కానివారంటూ లేరు. ఏ మాయ చేశావే చిత్రం తర్వాత సమంత ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా మారింది. గత ఏడాది నాగచైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారింది. రేపటితో( ఫిబ్రవరి 26,2020) సమంత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్ళు కావొస్తుండడంతో అభిమానులు ఈ మూమెంట్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో సమంత సినిమాలకి సంబంధించిన వీడియోలు షేర్ చేయడంతో పాటు ఆమె సినిమాలలోని స్టిల్స్ కొన్ని పోస్ట్ చేస్తున్నారు. వీటిపై స్పందించిన సమంత తనపై ఇంత ప్రేమోభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. రీసెంట్‌గా జాను సినిమాతో పలకరించిన సమంత ప్రస్తుతం ది ఫ్యామిలీ మేన్ 2 అనే వెబ్ సిరీస్‌తో పాటు తమిళ చిత్రం చేస్తుంది.
https://twitter.com/Samanthaprabhu2/status/1231981538289438721