హైదరాబాద్: ఇండియాలోని నిజమైన శక్తి.. అక్కడ ప్రజల ఆత్మలో కనిపిస్తుందని ట్రంప్ అన్నారు. సోమవారం అహ్మదాబాద్, ఆగ్రాలో ట్రంప్ టూర్ చేసిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. భారతదేశ చరిత్ర ఘనమైనదని, అది సాధించిన ప్రగతి అనన్యసాధ్యమైందన్నారు. ప్రజాస్వామ్య ప్రగతి, భిన్నత్వం, ఉన్నత భావాలు కలిగిన వ్యక్తుల సమాహారమే భారత్ అని ట్రంప్ అన్నారు. ఈ దేశంలో ఎన్నో సంపదలు ఉన్నాయన్నారు. అద్భుతమైన కళా కట్టడాలు ఉన్నాయన్నారు. భారత, అమెరికా ప్రజలు ఎప్పుడూ ఒకటిగా ఉంటారని ట్రంప్ తెలిపారు.
https://twitter.com/realDonaldTrump/status/1232005756054069248