నిర్మాతగా జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న నాని ఫలక్‌నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్‌తో కలిసి హిట్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విశ్వక్ ఓ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. తన వృత్తిలో భాగంగా ఎదురైన మొదటి కేసును చేదించేందుకు చేసే ప్రయత్నమే హిట్ అని తెలుస్తోంది. ఆ ప్రయాణంలో తనకు ఎదురైన ప్రమాదాలేంటి? ఆ కేసుని ఎలా ఛేదించాడు? అనే విషయాల నేపథ్యంగా ఈ సినిమా సాగబోతోన్నట్లు సమాచారం .
ఫిబ్రవరి 28న విడుదల కానున్న ఈ చిత్రంలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు శౌలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులకి మంచి థ్రిల్ కలిగించాయి. తాజాగా నాలుగున్నర నిమిషాల స్నీక్ పీక్ వీడియో విడుదల చేశారు. ఇది సినిమాపై భారీ అంచనాలు పెంచుతుంది. హిట్ అంటే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం అని ఇటీవల ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రీతీ అని ఒక మిస్సింగ్ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తుంది.