దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో హింసాకాండ కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి జాతీయ భద్రతా సలహాదారు, సీనియర్ పోలీసు అధికారి అయిన అజిత్ దోబాల్ రంగప్రవేశం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు అధికారులతో మూడుసార్లు సమావేశమైన అనంతరం హింసాకాండను అణచివేసి శాంతిభద్రతల పరిస్థితులను మెరుగుపర్చేందుకు అజిత్ దోబాల్ ను రంగంలోకి దించారు. దీంతో మంగళవారం అర్దరాత్రి అజిత్ బోబాల్ శీలంపూర్‌లో ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్, ఈశాన్య డీసీపీ వేదప్రకాష్ సూర్యలతో కలిసి శాంతిభద్రతల పరిస్థితులను సమీక్షించారు. అజిత్ దోబాల్ మంగళవారం రాత్రే ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి మౌజ్‌పూర్, జఫరాబాద్, గోకుల్‌పురి, భాజన్‌పూర్ ప్రాంతాల్లో తిరిగి పరిస్థితులను సమీక్షించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, అనుకూలంగా ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ రాజుకున్న జఫరాబాద్,మాజ్‌పూర్,బాబర్‌పూర్ ప్రాంతాల్లో అజిత్ దోబాల్ తిరిగారు.
ఢిల్లీ హింసాకాండ...అర్దరాత్రి రంగంలోకి దిగిన అజిత్ దోబాల్