విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా ఇటు తెలుగు అటు హిందీ, తమిళం, మలయాళం ఇలా పలు భాషలలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. నటుడిగానే కాకుండా అప్పుడప్పుడు నిర్మాతగా, దర్శకుడిగాను తన ప్రతిభ నిరూపించుకుంటూ వస్తున్నారు ప్రకాశ్ రాజ్. అయితే ఇటీవల నడిగర్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ తమిళంలో రూపొందించిన ఉన్ సమయల్ అరైయిల్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రానికి గాను బాలీవుడ్ ఫైనాన్సియర్ ఒకరి వద్ద రూ.5 కోట్లు అప్పు తీసుకున్న ప్రకాశ్ రాజ్, ఇటీవల చెక్ ఇచ్చారు. ఆ చెక్ బ్యాంక్‌లో వేయగా బౌన్స్ అయింది. దీంతో సదరు ఫైనాన్షియర్ మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, న్యాయమూర్తి ప్రకాశ్ రాజ్‌కి సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ 2వ తేదీలోగా కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించారు.
చెక్ బౌన్స్ కేసులో ప్రకాశ్ రాజ్‌కి సమన్లు జారీ చేసిన హైకోర్టు