అమెరికా అధ్యక్షుడు మొతెరా స్టేడియంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలంతా ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు ట్రంప్ రాకతో మొతెరా స్టేడియం అంతా జనసంద్రమైంది. అంతకు ముందు డోనాల్డ్ ట్రంప్.. సతీమణి మిలానియా ట్రంప్‌తో కలిసి సబర్మతి ఆశ్రమంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమం బయట షూస్ వదిలి ఇద్దరూ లోపలికి వెళ్లారు. మహాత్మాగాంధీ ఆశ్రమంలో గడిపిన విశేషాలన్నీ మోదీ ఈ సందర్భంగా ట్రంప్ దంపతులకు వివరించారు. బాపూ తిప్పిన చర్ ఖాను ట్రంప్ దంపతులు ఎంతో ఆసక్తిగా తిలకంచారు. అక్కడున్న సిబ్బంది కూడా ట్రంప్ కు చర్ ఖా పనిచేసే విధానాన్ని వివరించారు. విమానం దిగగానే ట్రంప్‌ను గట్టిగా గుండెలకు హత్తుకున్నారు. భారత్‌కు సఘన స్వాగతం పలికారు. అనంతరం ట్రంప్ ఎయిర్ పోర్టు నుంచి సబర్మతి ఆశ్రమానికి బయల్దేరారు. మరోవైపు ట్రంప్ పర్యటన నేపథ్యంలో అడుగడుగునా భారీ ఏర్పాట్లు చేశారు.ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా భద్రతను మరింత పటిష్టం చేశారు.
ట్రంప్ రాకకు కొన్ని నిమిషాల ముందు.... అతిథి దేవో భవ అంటూ ప్రధాని తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మరోవైపు అహ్మాదాబాద్ మోతెరా స్టేడియంకు ఇప్పటికే భారీ ఎత్తున జనం తరలివచ్చారు. ఈ స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు అమెరికా జాతీయ జెండాలతో ప్రజలు సందడి చేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో మొతెరా స్టేడియంలో ఏర్పాటు చేసిన గుజరాతీ సంప్రదాయ నృత్యాలు... ఆహుతుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్