తెహ్రాన్ : కరోనా వైరస్(కొవిడ్-19) ఇరాన్‌ను కబళిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇరాన్ ఆరోగ్య శాఖ ఉప మంత్రి హరిర్చికి కరోనా వైరస్ సోకగా.. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు మసౌమే ఎబ్తేకర్‌కు సోకడంతో ఇరాన్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎబ్తేకర్ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. ఎబ్తేకర్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. ఆమె బృందంలో ఉన్న మరికొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరందరి రక్త నమునాలను సేకరించి వైద్యశాలకు పంపారు. ఈ రిపోర్టు శనివారం వచ్చే అవకాశం ఉందని ఫరీబా తెలిపారు. ఇరాన్‌లో మొత్తం 240 మందికి కరోనా వైరస్ సోకగా 26 మంది మృతి చెందారు. ఫిబ్రవరి 19న ఒక్కరోజే కరోనా వైరస్ సోకినట్లు 106 కేసులు నమోదు అయ్యాయి. ఇక చైనాలో ఈ వైరస్ బారినపడి 2800 మంది ప్రాణాలు కోల్పోయారు. 78 వేల మంది చికిత్స పొందుతున్నారు.
ఇరాన్ ఉపాధ్యక్షురాలికి కరోనా వైరస్