యాదాద్రి భవనగిరి: రేపటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 28వ తేదీన అలంకార వేడుకలు నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీన ఎదుర్కోలు, మార్చి 4వ తేదీన తిరుకల్యాణం, మార్చి 5వ తేదీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం, మార్చి 7వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవం ముగుస్తుంది. ప్రధాన ఆలయ విస్తరణ పనులు జరుగుతుండటంతో బాలాలయంలోనే ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్చి 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు యాదాద్రిలో సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదాద్రిలో జరిపే నిత్యపూజల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు శాశ్వత, మొక్కు కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమాలు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కావున భక్తులు సహకరించాలని కోరారు.
రేపటి నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు