'రెడ్' టీజ‌ర్‌తో థ్రిల్ చేయ‌నున్న రామ్


ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందుకున్న రామ్ ప్ర‌స్తుతం థ్రిల్ల‌ర్ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెడ్ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కిశోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తుండ‌గా,  ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొలి సారి ఈ చిత్రంలో డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్నారు రామ్‌.  ఇప్ప‌టికే రామ్‌కి సంబంధించి ప‌లు లుక్స్ విడుద‌ల కాగా, ఇవి ప్రేక్ష‌కుల‌కి మాంచి కిక్ ఇచ్చాయి. ఇక రీసెంట్‌గా చిత్ర టీజ‌ర్  ఫిబ్రవరి 28 సాయంత్రం 5 గంటలకు విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేస్తూ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో రామ్ మాస్‌తో పాటు క్లాస్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ పాట‌ని  సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులోని డోలమైట్స్‌లో మైనస్‌ ఐదు డిగ్రీల వాతావరణంలో చిత్రీకరించారు. ఇక్కడ షూటింగ్‌ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం రెడ్‌ కావడం విశేషం. ఏప్రిల్‌ 9న విడుదల కానున్న ఈ సినిమాకి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.