లండన్: బ్రిటన్‌కు చెందిన 111 ఏండ్ల వృద్ధుడు, రిటైర్డ్ ఇంజినీర్ బోబ్ వెయిటోన్ పేరు ప్రపంచంలోకెల్లా అత్యంత వృద్ధుడిగా రికార్డులకెక్కనున్నది. గత ఆదివారం జపాన్‌కు చెందిన చిటెస్టు వాటనాబే (112) మరణించారు. ఆయన తర్వాత అత్యధిక కాలం జీవిస్తున్న వ్యక్తిగా వెయిటోన్ నిలువనున్నారు. 1908 మార్చి 29న వెయిటోన్ జన్మించారని బీబీసీ ఓ వార్తాకథనంలో తెలిపింది. ఈ వార్తలపై ఆయన స్పందిస్తూ.. ‘నేను అత్యధిక కాలం జీవించి ఉండటం మీకు అద్భుతంగా కనిపించవచ్చు. కానీ నా జీవితంలోని ఘటనల్లో అది ఒక భాగం’ అని తెలిపారు. వాటనాబే మృతి తర్వాత ప్రపంచంలోకెల్లా అత్యధిక కాలం జీవిస్తున్న వ్యక్తి కోసం రికార్డులను పరిశీలిస్తున్నామని గిన్నిస్ బుక్ అధికార ప్రతినిధి చెప్పారు.
అత్యంత వృద్ధుడిగా బ్రిటన్ వాసి?