దేశీ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. బెంచ్‌మార్క్ సూచీలు సోమవారం పతనమయ్యాయి. కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్ భారీగా నష్టపోయింది. చైనాకు వెలుపల ఇతర దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో అంతర్జాతీయ మార్కెట్లు పడిపోయాయి. దీంతో ఆ ఎఫెక్ట్ మన మార్కెట్‌పై కూడా కనిపించింది. ఒక్క రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.3 లక్షల కోట్లకు పైగా ఆవిరయ్యింది.ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 864 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ కూడా 12 వేల మార్క్ దిగువకు పడిపోయింది. 11,813 స్థాయికి క్షీణించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ఎఫెక్ట్ గట్టిగానే ఉండొచ్చనే అంచనాలు ఇందుకు కారణం. చివరకు సెన్సెక్స్ 807 పాయింట్ల నష్టంతో 40,363 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 251 పాయింట్ల నష్టంతో 11,829 పాయింట్ల వద్ద ముగిసింది. బడ్జెట్ తర్వాతి నుంచి చూస్తే.. ఈ స్థాయి మార్కెట్ పడిపోవడం ఇదే తొలిసారి.
కరోనా దెబ్బ.. ఒక్క రోజులోనే రూ.3 లక్షల కోట్ల నష్టం!