యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత ఏడాదికి సాహో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, ఇప్పుడు ఆయన 20వ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ 20వ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. కొద్ది రోజుల తర్వాత కీలక సన్నివేశాల కోసం విదేశాలకి వెళ్లనున్నారు. జూలై వరకు చిత్ర షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తుండగా, అక్టోబర్ 16న చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా సమయంలో సినిమాకి మంచి కలెక్షన్స్ కూడా వస్తాయని భావిస్తున్న చిత్ర బృందం అదే డేట్‌ని లాక్ చేయాలని అనుకుంటుందట. రాధే శ్యామ్ లేదా ఓ డియర్ అనే టైటిల్స్‌ని ఈ చిత్రానికి పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ తన 21వ చిత్రాన్ని మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ప్రభాస్ 20వ చిత్ర రిలీజ్ డేట్ ఎప్పుడు ?