చేసిన ప్రతి చిత్రాన్ని ప్రయోగాత్మకంగా రూపొందిస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఘాజీ చిత్రంతో నేషనల్ స్టార్ డం పొందిన ఈ యువ దర్శకుడు చివరిగా అంతరిక్షం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న సంకల్ప్ రెడ్డి ఏకంగా బాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడట. దక్షిణాదిలో కత్తి.. ఎన్టీఆర్‌తో శక్తి..సూర్యతో సికిందర్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్ హీరోగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తుంది.ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొదలు కాగా, ఈ చిత్రాన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇదే కాక మరో బాలీవుడ్ మూవీని తెరకెక్కించేందుకు కూడా సంకల్ప్ సన్నాహాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.
బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్న యంగ్ డైరెక్టర్..!